EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్: దీపావళికి ముందే ఈపీఎఫ్ఓ వడ్డీ జమయ్యే అవకాశం!
EPFO: 2021 ఆర్థిక సంవత్సరం వడ్డీని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే జమ చేయనుందని సమాచారం. దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ వడ్డీ వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
EPFO: ఉద్యోగులకు శుభవార్త. కరోనా కష్టకాలంలో సతమతమవుతున్న వేతన జీవులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు వేచిచూస్తున్న 2021 ఆర్థిక సంవత్సరం వడ్డీని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే జమ చేయనుందని సమాచారం. దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ(EPFO) వడ్డీ వేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పండుగ సీజన్ లో ఉద్యోగులకు కాస్త ముందుగానే తీపికబురు అందే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే డీఏ, డీఆర్ పొందిన ఉద్యోగులకు ఈ వడ్డీ(Interest) జమ మరింత చేయూతనివ్వనుంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్ల(PF Deposits)పై 8.5 శాతం వడ్డీరేటే(Interest Rate) కొనసాగుతుందని రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ మార్చిలోనే స్పష్టం చేశారు. ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఆమోద ముద్ర వేస్తుందని కథనాలు తెలుపుతున్నాయి. "2020-21 సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటును కొనసాగించేందుకు ఆమోదం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. వడ్డీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నాక, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని 8.5 శాతం వడ్డీని జమ చేస్తాం. మా ఆఖరి బోర్డు మీటింగ్ తర్వాత నుంచి ఈక్విటీ మార్కెట్లు చాలా బాగా పెరుగుతున్నాయి. దీని ద్వారా మంచి ఆదాయమే వచ్చింది" అని ఈపీఎఫ్ఓ అధికారి ఒకరు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read; EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. రేపే ఆఖరి తేదీ.. ఇలా చేయకపోతే PF రాదు
కాగా గత ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ఓ(EPFO) ఆదాయం రూ.70,300 కోట్లకు పడిపోయినట్టు నివేదికలు వెల్లడించాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో రూ.4వేల కోట్ల విలువైన భాగాన్ని కూడా విక్రయించింది. డెబిట్ పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ, ఈక్విటీ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టే సాధారణంగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను ఖరారు చేస్తుంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ, డీఆర్ లను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ జులై 14న ఆమోదముద్ర వేసింది. ఇది జులై 1 నుంచి అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్(EPFO Contribution) పై వచ్చే వడ్డీలపై పన్ను నిబంధనలను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) మార్చింది. రూ.2.5లక్షల కాంట్రిబ్యూషన్ కంటే ఎక్కువగా ఉన్న వారికి ఇది వర్తించనుంది. కొత్త నిబంధన ప్రకారం, సంస్థలు రెండు ఈపీఎఫ్ ఖాతాలను కలిగి ఉండాలి. ఒకటి ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ కోసం, మరొకటి నాన్ ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ కోసం. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే దీని ప్రభావం ఉంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook