PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ అడ్వాన్స్ ఎలా విత్ డ్రా చేయవచ్చు
PF Withdrawal: పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సేవింగ్ స్కీమ్ వర్తిస్తుంది. అటు ఉద్యోగి, ఇటు సంస్థ తరపున పీఎఫ్ ఎక్కౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి. మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
PF Withdrawal: రిటైర్మెంట్ తరువాత ఉద్యోగి భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడేందుకు పీఎఫ్ అనేది మంచి ప్రత్యామ్నాయం. నెల నెలా జీతం నుంచి కొద్దిమొత్తం జమ అవుతుంటుంది. పీఎఫ్ డబ్బులపై కేంద్ర ప్రభుత్వం ఏడాదికోసారి వడ్డీ జమ చేస్తుంటుంది. అయితే ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు పీఎఫ్ డబ్బుల్ని అడ్వాన్స్‌గా పొందే వీలుంది. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు.
ముందుగా ఈపీఎప్ఓ అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/. ఓపెన్ చేయాలి. తరువాత యూఏఎన్ లేదా ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత మేనేజ్ అండ్ సెలెక్ట్ విత్‌డ్రాయల్ ఎంచుకోవాలి. ఆన్‌లైన్ క్లెయిమ్ ఎంటర్ చేసి మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ సమర్పించాలి. ఇప్పుడు మీ బ్యాంక్ ఎక్కౌంట్ సంబంధిత సమాచారం ఫిల్ చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చివరిగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ చేసేందుకు యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ అవసరమౌతాయి. బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు, పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుంది. మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ విధానంలో ప్రయోజనాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. ఇంట్లో కూర్చుని, ఏ ఏజెంట్ అవసరం లేకుండా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫైల్ చేసే విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది. కానీ డాక్యుమెంట్లన్నీ జాగ్రత్తగా అప్‌లోడ్ చేయడంలో ఇబ్బంది రావచ్చు. అప్లికేషన్ ప్రక్రియ కూడా ఒక్కోసారి ఆలస్యం కావచ్చు.
Also read: 7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook