Indian evacuation: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు షురూ- బయల్దేరిన తొలి విమానం!
Indian evacuation: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాల నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలి విమానం రొమానియా నుంచి బయల్దేరింది.
Indian evacuation: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారత్‌కు తరలించే ప్రయత్నాల్లో భారత్ మరో ముందడుగు వేసింది. ఉక్రెయిన్ సమీప దేశమైన రొమానియా నుంచి 219 మందితో తొలి విమానం.. ముంబయికి బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జయ్శంకర్ తెలిపారు.
యుద్ధ భయాలతో..
రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుందో. రాజధాని నగరంపై కూడా బాంబు దాడులో చేస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. అందుకే భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేసింది.
ఉక్రెయిన్ గగనతలం మూసేసిన కారణంగా.. ఆ దేశానికి సమీపంగా ఉన్న ఇతర దేశాల నుంచి భారత పౌరులను స్వదేశానికి రప్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. 219 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం.. రొమానియా నుంచి ముంబయికి బయల్దేరింది. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే కావడం గమనార్హం.
నిజానికి ఉక్రెయిన్ గగన తలం మూసేయకుంటే.. 24 నుంచి 26 వరకు ఇండియా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ మధ్య మూడు విమానాలను నడిపి భారతీయులను వెనక్కి రప్పించాలని భావించింది. అయితే అంతలోనే గగనతలం మూసేయడంతో.. ప్లాన్ బీ అమలు చేస్తోంది.
ఇంకా వందలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తొంది ప్రభుత్వం.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విదేశాంగ మంత్రి జయ్శంకర్.. భారతీయులను రప్పించే ప్రయత్నాల్లో ముందడుగు పడిందని చెప్పారు.
ఇందుకోసం కేటాయించిన బృందాలు నిరంతరయంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియను స్వయంగా తానే పరిశీలిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువశాతం విద్యార్థులే.
Also read: Indians in Ukraine: ప్రభుత్వ ఖర్చుతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి భారతీయులు!
Also read: Russia Ukraine War: రష్యా యుద్ధ తంత్రం.. మోదీ సాయం కోరిన ఉక్రెయిన్.. జోక్యం చేసుకుంటారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook