ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న వాళ్లే అందలం ఎక్కుతారు..వారే అధికారం చేపట్టగలరు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మెజార్టీ ప్రజలు జైకొట్టినా అధికారం చేపట్టలేని పరిస్థితి ఉంటుంది..మధ్యప్రదేశ్ ఎన్నికలే ఇందుకు మంచి ఉదహరణ. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు కమలం పార్టీకే ఓటు వేశారు.. కానీ పార్టీ మాత్రం ఓడిపోయింది.  ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి మొత్తం 41 శాతం ఓట్ల పోలయ్యాయి.. అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం 40.9 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బీజేపీకి 1,56,42,960 ఓట్లు రాగా..కాంగ్రెస్ కు 1,55,95,153 ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ మధ్యప్రదేశ్ లో బీజేపీ ఓటమిపాలైంది. కమల దళానికి  ఓట్లు పెరిగినా సీట్లు తగ్గడమే ఓటమిచవిచూడటానికి కారణమట. ఎందుకంటే మన ప్రజాస్యామ్య వ్యవస్థలో ఓట్ల కంటే సీట్లనే ప్రమాణికంగా తీసుకుంటారు..ఇక్కడ కూడా సీట్లను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పాల్సి వచ్చింది.


ఈ ఎన్నికల్లో బీజేపీకి 109 స్థానాలు రాగా..కాంగ్రెస్ పార్టీ 114 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 115. పూర్తి మెజార్టీకి  ఒకే అడుగుదూరంలో ఉన్న హస్తం పార్టీకి మాయావతి తన ఓటు వేసి..అంటే తన మద్దతు ప్రకటించి కాంగ్రెస్ ను గట్టిక్కించారు. మధ్యప్రదేశ్ లో మాయవతి పార్టీకి 2 సీట్లు మాత్రమే దక్కినా కింగ్ మేరక్ గా అవతరించడం గమనార్హం.