మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అభిలాష కుమారి కొత్త బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె  హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమార్తె కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జస్టిస్ కుమారి హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1984లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి..  హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం అదే రాష్ట్రంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పదోన్నతి పొందారు.


2005లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. మణిపూర్‌కి  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక.. అభిలాష కుమారి ఓ అరుదైన రికార్డును నమోదు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన తొలి హిమాచల్ ప్రదేశ్ మహిళగా ఆమె వార్తల్లోకెక్కారు.