తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసీ ముగియగానే పలు చానెళ్లు ఎగ్జిట్ పోల్స్ వివరాలను బయటపెట్టాయి. టైమ్స్ నౌ, సీఎన్ఎన్ న్యూస్ 18, ఇండియా టుడే, యాక్సిస్ సర్వే ఫలితాల్లో ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కడుతున్నట్లు తేలింది. వివిధ సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టైమ్స్ నౌ : 
టీఆర్ఎస్ - 66
మహాకూటమికి 37
బీజేపీ 7
ఇతరులు 9 స్థానాలు


సీఎన్ఎస్ న్యూస్ 18  :
టీఆర్ఎస్       : 50 -65 స్థానాలు
మహాకూటమి : 38 -52 స్థానాలు
బీజేపీ            : 4 -7 స్థానాలు
ఇతరులు        : 8 -14 స్థానాలు


ఇండియా టుడే :
టీఆర్ఎస్      : 79 -91  స్థానాలు


కాంగ్రెస్         : 21 -33 స్థానాలు


బీజేపీ           : 1 -  3 స్థానాలు


ఇతరులు      : 4 - 7 స్థానాలు


ఎక్సిస్       
టీఆర్ఎస్         : 85
మహాకూటమి   : 27
బీజేపీ              : 2
ఇతరులు         : 5


 


ఎన్నికల ముందు అనే సర్వేలు టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ప్రకటించాయి. అయితే అందుకు భన్నింగా ఎగ్గిట్ పోల్ ఫలితాలు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజా ఫలితాలపై టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నెల 11న వచ్చే ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా మహాకూటమి నేతలు ఎగ్జిట్ ఫోల్ ఆధారంగా ఫలితాలు తేల్చలేమని..గతంలో ఇలాంటి ఫలితాలు తారుమైన రోజులు ఉన్నాయని .. ఫలితాలు మాత్రం తమకే అనుకూలంగా వస్తాయాని ధీమా వ్యక్తం చేస్తున్నారు