మార్క్ జుకర్‌బర్గ్‌కు భోపాల్ కోర్టు సమన్లు
ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కి భోపాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమను ఫేస్‌బుక్ యాజమాన్యం బాధపెట్టిందని స్టార్టప్ సంస్థ `ది ట్రేడ్‌బుక్.ఆర్గ్` ఫిర్యాదు చేసిన క్రమంలో కోర్టు సమన్లు జారీ చేసింది.
ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కి భోపాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమను ఫేస్‌బుక్ యాజమాన్యం బాధపెట్టిందని స్టార్టప్ సంస్థ 'ది ట్రేడ్‌బుక్.ఆర్గ్' ఫిర్యాదు చేసిన క్రమంలో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు సెషన్స్ జడ్జీ పార్థశంకర్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. 'దిట్రేడ్‌బుక్.ఆర్గ్' అనే సంస్థను యువ ఎంట్రప్రెన్యూర్ స్వప్నిల్ రాయ్ ప్రారంభించారు.
తమ బిజినెస్ ప్రమోషన్ నిమిత్తం ఫేస్‌బుక్‌లో పెయిడ్ క్యాంపెయిన్ కోసం డబ్బులు కట్టారు ఆయన. అయితే కొన్ని రోజుల తర్వాత డబ్బులు కట్టినా కూడా తమ ప్రకటనలను ఫేస్‌బుక్ నుండి తొలిగించడంపై స్వప్నిల్ అభ్యంతరం తెలిపారు. అలాగే ఫేస్‌బుక్ సంస్థ తమకు లీగల్ నోటీసులు కూడా పంపిందని, దిట్రేడ్‌బుక్.ఆర్గ్ అనే పేరు అభ్యంతరకరంగా ఉందని.. ఆ పదాన్ని తొలిగించాలని కూడా ఫేస్‌బుక్ డిమాండ్ చేసిందని స్వప్నిల్ తెలిపారు
స్వప్నిల్ రాయ్ ఫేస్‌బుక్ యాజమాన్యంపై సివిల్ లా సూట్ ఫైల్ చేశారు. ఫేస్‌బుక్ తనను మానసికంగా వేధిస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వెబ్ సైట్ పేరు మార్చమని ఒత్తిడి తెస్తుందని కూడా స్వప్నిల్ తెలిపారు. స్వప్నిల్ సంస్థ ఫైల్ చేసిన ట్రేడ్ మార్క్ అప్లికేషను విత్ డ్రా చేసుకోవాలని ఫేస్‌బుక్ యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని.. ఈ క్రమంలో తమకు లీగల్ నోటీసు కూడా పంపిందని స్వప్నిల్ పేర్కొన్నారు