ప్రపంచ వ్యాప్తంగా 2020లో ఇప్పటి వరకు రెండు చంద్రగ్రహణాలను ( Lunar Eclipse ) ప్రజలు వీక్షించారు. ఇటీవలే సూర్యగ్రహణం ( Solar Eclipse ) కూడా ఏర్పడింది. అయితే త్వరలో మరో చంద్రగ్రహణం ఏర్పడనుంది. జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా (Lunar Eclipse On July 5 ) అనేక దేశాల్లో  చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. Also Read :  Wine Shops Timing: తెలంగాణలో రాత్రి 9.30 వరకు వైన్ షాపులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే  అన్ని దేశాల్లో ఇది కనిపించదు. ముఖ్యంగా అమెరికాలో ఇది కనిపించనుంది.  దాంతో పాటు ఐరోపాలోని అనేక దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో చంద్రగ్రహణం ప్రభావం కనిపించనుంది. దాంతో పాటు భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు. 


ఇక చంద్రగ్రహణం వల్ల చంద్రుడి పరిమాణంలో మార్పు ఉండదు.  ఈ రోజు కనిపించిన విధంగా చంద్రుడు మేఘాల మధ్య కనిపించిన విధంగా మనం చూడవచ్చు.


Also Read : SSC: 283 పోస్టులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల


చంద్రగ్రహణం గురించి శాస్త్రవేత్తలు ( Lunar Eclipse On July 5 Facts ) కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జూలై 4న లాస్ ఏంజిల్స్ లో  మూడు గంటలపాటు  కనిపిస్తుందన్నారు. దాంతో పాటే కేప్ టౌన్ లో చంద్రగ్రహణం జూలై 5న కనిపించనుంది.  ఈ చంద్రగ్రహణాన్ని ఉపఛ్చాయ చంద్రగ్రహణం లేదా నీడ చంద్రగ్రహణం అని పిలుస్తారు.