Agriculture bills passed in Rajya Sabha: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుల (Agriculture bills) పై రాజ్యసభలో పెను దుమారం చెలరేగింది. విపక్షాల ఆందోళన మధ్యనే ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లులు పాస్ అయినట్లు రాజ్యసభ (Rajya Sabha) డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్ తెలిపారు. అనంతరం రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ రేపటికి వాయిదా వేశారు. అయితే.. విపక్షాలు ఓటింగ్ కోసం పట్టుబట్టగా.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ వారి వాదనను తిరస్కరించారు. చివరికి మూజువాణి ఓటుతో బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ వ్యవసాయ సంబంధిత బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే మద్దతివ్వగా.. కాంగ్రెస్‌, టీఎంసీ, టీఆర్‌ఎస్‌, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్‌, ఎస్పీ, ఆప్‌, బీఎస్పీ తదితర పార్టీల సభ్యులు వ్యతిరేకించారు. అయితే అంతకుముందు ఈ బిల్లులకు లోక్‌సభలో కూడా ఆమోదం లభించింది.  Also read: Agriculture bills: పెద్దల సభలో గందరగోళం


అంతకుమందు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రైతులకు నష్టం చేకూర్చేలా ఈ బిల్లులు ఉన్నాయంటూ.. విపక్షాల సభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తారు. నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఈ క్రమంలో వ్యవసాయ బిల్లుల స‌వ‌ర‌ణ‌ల‌పై స‌భ్యుల వివ‌ర‌ణ తీసుకోకుండానే వాయిస్ ఓటుకు ఎలా వెళ్తారంటూ.. తృణమూల్‌ కాం‍గ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌‌ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి నిరసన తెలిపారు. Also read: Agriculture Bills: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు