Farmers leaves protesting sites : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు విరమించుకున్న సంగతి తెలిసిందే. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు శనివారం (డిసెంబర్ 11) సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్స్ నుంచి ఇంటి బాట పట్టారు. ఆ ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న శిబిరాలను తొలగించారు. ఇళ్లకు బయలుదేరే ముందు ట్రాక్టర్లలో ఊరేగింపుగా విక్టరీ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింఘు, ఘాజీపూర్ బోర్డర్స్‌ను ఖాళీ చేసే ముందు రైతులు (Farmers Protest) కొద్దిసేపు ప్రార్థనలు నిర్వహించారు. స్వీట్లు పంచుకుని సంతోషం వెలిబుచ్చారు. సింఘు బోర్డర్ వద్ద పలువురు రైతు ఉద్యమకారులు భాంగ్రా నృత్యాలు చేయగా.. మరికొంతమంది భజన కీర్తనలు పాడారు. రైతులు పెద్ద ఎత్తున బోర్డర్స్ నుంచి ఇళ్లకు బయలుదేరడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సింఘు బోర్డర్‌ సమీపంలోని కేఎంపీ ఫ్లైఓవర్‌పై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.


రైతు ఉద్యమానికి నేత్రుత్వం వహించిన రాకేశ్ టికాయత్ (Rakesh Tikait) మాట్లాడుతూ... తాను మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీ బోర్డర్‌లోనే ఉంటానని చెప్పారు. డిసెంబర్ 15న తాను నిరసన ప్రదేశాన్ని వీడుతానని స్పష్టం చేశారు. 'రేపు ఉదయం పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడి నుంచి ఇళ్లకు బయలుదేరుతారు. ఇవాళ జరిగిన సమావేశంలో అన్ని అంశాలపై చర్చించుకున్నాం. ప్రార్థనలు జరిపాం. మాకు సాయం అందించినవారిని కలుసుకున్నాం. ఇప్పటికే చాలామంది నిరసన ప్రదేశాల నుంచి ఇళ్లకు బయలుదేరారు. మరో నాలుగైదు రోజుల్లో అందరూ వెళ్లిపోతారు. నేను డిసెంబర్ 15న ఇక్కడి నుంచి వెళ్తాను.' అని చెప్పుకొచ్చారు.


అదే సమయంలో రాకేశ్ టికాయత్ (Rakesh Tikait) కేంద్రానికి ఒక హెచ్చరిక కూడా చేశారు. ఒకవేళ ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోలేకపోతే... తాము మళ్లీ వస్తామన్నారు. సాగు చట్టాల ఉపసంహరణ, కనీస మద్దతు ధరకు కమిటీ నియామకం, రైతులపై కేసుల ఉపసంహరణకు కేంద్రం నుంచి లభించిన హామీలతో రైతులు ఆందోళనలు విరమించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును (Farm Laws Repealed) కేంద్రం ప్రవేశపెట్టగా... దానికి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకంతో  వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయింది.


 



Also Read: వైరల్ ఫొటోస్.. బాయ్‌ఫ్రెండ్‌తో గోల్డెన్‌ టెంపుల్ వెళ్లిన యువరాజ్ మాజీ ప్రేయసి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి