Farmers Chalo Delhi: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తలపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై మరోసారి ఉద్యమం ప్రారంభం కానుంది. ఉత్తరాది రైతులు మరోసారి ఉద్యమించనున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ అంటే డిసెంబర్ 13న ఛలో ఢిల్లీ చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా మూడు వ్యవసాయ చట్టాల్ని ప్రవేశపెట్టడంతో 2021లో ఏడాదిన్నర కాలంపాటు దేశ రాజధాని ఢిల్లీలో రాత్రనక పగలనక తేడా లేకుండా రైతులు రోడ్డెక్కారు. రోడ్లపైనే నిద్రాహారాలు కొనసాగించారు. చాలామంది చలికి తట్టుుకోలేక అనారోగ్యంతో మరణించారు. పరిస్థితి విషమిస్తుండటంతో తాత్కాలికంగా చట్టాల్ని ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఇప్పుడు మరోసారి  రైతులు ఉద్యమానికి దిగుతున్నారు. ఇవాళ ఛలో ఢిల్లీ పేరుతో మహా ర్యాలీ చేపట్టారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఇలా దాదాపు 200 రైతు సంఘాలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఇవాళ చేపట్టిన ర్యాలీలో దాదాపుగా 3 లక్షలమంది రైతులు పాల్గొనవచ్చని అంచనా. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్నించి 500 పైగా ట్రాక్టర్లు డిల్లీకు రానున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన డిమాండ్లను పరిష్కరించాలని రైతులుపట్టుబడుతున్నారు. 


రైతుల మహా ర్యాలీ ఉపసంహరించుకునేలా చేసేందుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, నిత్యానంద రాయ్, అర్జున్ ముండాలు రైతు సంఘ నాయకులతో అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో ఇవాళ్టి ర్యాలీ యధాతధంగా కొనసాగనుంది. 


మరోవైపు రైతుల ఆందోళనను పరిగణలో తీసుకుని ఢిల్లీ, హర్యానా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్లేవారు పంచ్ కుల-బర్వాల-సాహా-బరారా-సిప్లి-కురుక్షేత్ర-యమునా నగర్ ద్వారా రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. 


Also read: Why Modi Photos: అక్కడ ప్రధాని మోదీ ఫొటోలు ఎందుకయ్య? అవసరమా? ముఖ్యమంత్రి నిలదీత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook