Farmer protests Updates: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. అంతకుముందు ఏడుసార్లు జరగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఎనిమిదోసారి జరగనున్న చర్చలపై ప్రాధాన్యం సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎముకలు కొరికే చలిలో, వర్షంలో కూడా రైతులు వెనకడుగు వేయకుండా తమ ఆందోళనను (Farmer Agitation) ఢిల్లీ సరిహద్దుల్లోని పలుచోట్ల కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Borders) గురువారం వేలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అయితే జనవరి 26న నిర్వహించే కిసాన్ రిపబ్లిక్ పరేడ్‌ (Farmers Organizations) సన్నాహక ఏర్పాట్లల్లో భాగంగా ఈ ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించినట్లు రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ


అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల్లో సవరణలు మాత్రం చేస్తామని రద్దు మాత్రం అంగీకరించేదిలేదని (Central Government) ఇప్పటికే రైతులకు స్పష్టంచేసింది. Also Read: Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ ర్యాలీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook