Delhi Farmers Protest: ఉద్రిక్తంగా మారిన ట్రాక్టర్ ర్యాలీ, రైతన్నలపై విరిగిన లాఠీ
Delhi Farmers Protest: దేశ గణతంత్ర దినోత్సవాన అన్నదాతలపై లాఠీ విరిగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లక్షలాది రైతులు దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
Delhi Farmers Protest: దేశ గణతంత్ర దినోత్సవాన అన్నదాతలపై లాఠీ విరిగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లక్షలాది రైతులు దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
దేశమంతా 72వ గణతంత్ర వేడుకల్ని( 72nd Republic day celebrations ) జరుపుకుంటోంది. అదే సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో ( Delhi Borders ) కొనసాగుతున్న అన్నదాత నిరసన ఉద్రిక్తతకు ( Farmers protest leads to violence ) దారి తీసింది. దేశ రాజధాని రోడ్లపై రైతన్నలపై లాఠీ పడింది. రైతు చట్టాల ( Farm Bills ) కు వ్యతిరేకంగా చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ( Tractor rally ) కోసం వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతన్నల్ని పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా అన్నింటినీ ఛేదించుకుంటూ ఢిల్లీ వైపు సాగింది ట్రాక్టర్ ర్యాలీ. రైతుల్ని నియంత్రించేందుకు భాష్పవాయువు ప్రయోగం, నీటి ట్యాంకులతో అడ్డుకునే ప్రయత్నాలు చేశారు ఢిల్లీ పోలీసులు. అయినా సరే బ్యారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ రైతులు ముందుకు సాగారు.
Also read: Padma Awards Announcement: దివంగత ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ అవార్డు
రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన తరువాతే రైతలకు ట్రాక్టర్ పేరేడ్ ( Farmers Tractor Rally ) కు పోలీసులు అనుమతి ఉంది. కానీ రైతులు ఉదయం 8 గంటల్నించే ఆందోళన ప్రారంభించారు. సరిహద్దు దాటి మరీ వస్తుండటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దూసుకువస్తున్న రైతులపై లాఠీఛార్జ్ ( Lathi charge on Farmers ) జరిపారు. పోలీసుల లాఠీఛార్జ్‌తో సింఘు, టిక్రీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. పాండవ్ నగర్ సమీపంలో ఢిల్లీ, మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే పై బ్యారికేడ్లను రైతులు తొలగించి ముందుకు దూసుకొచ్చారు.
ట్రాక్టర్ పరేడ్ ( Tractor parade ) లో భాగంగా రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. అన్ని మార్గాల నుంచి రైతులు ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీ సరిహద్దులు నిండిపోయాయి. వారిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు బ్యారికేడ్లు పెట్టినా ధ్వంసం చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. నీళ్ల ట్యాంక్‌లతో రైతులను అడ్డగించారు. అడ్డుగా పెట్టిన బస్సుల్ని, కన్పించిన పోలీసు వాహనాల్ని రైతులు ( Farmers destroyed police vehicles ) ధ్వంసం చేశారు.
Also read: Farmers Tractor Rally: బారీకేడ్లను విచ్ఛిన్నం చేసుకుంటూ ఢిల్లీలో ముందుకు సాగుతున్న రైతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook