Daughter Private videos: ఘోరం.. కూతురి ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన తండ్రి.. కారణం ఏంటంటే..?
Udupi news: ఉడుపిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రి తనకూతురని కూడా చూడకుండా శాడిస్ట్ లాగా మారాడు. ఏకంగా కూతురు ప్రైవేటు వీడియోలన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన కన్నడనాట తీవ్రదుమారంగా మారింది.
father post daughter private videos on social media in udupi: కొందరు సమాజంలో పశువులకన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు కన్పిస్తే చాలు.. వావి, వరుసలు మరిచిపోయి పశువుల్లాగా మారిపోతున్నారు. ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మాత్రం.. కొందరు కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. అమ్మాయిల భద్రత మాత్రం పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. మహిళలకు గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఉద్యోగ ప్రదేశాలు ఇలా ఎక్కడ కూడా సెఫ్టీ లేదని చెప్పుకొవచ్చు. చివరకు.. అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్ కు వెళ్తే అక్కడ కూడా దారుణాలు జరుగుతున్నాయి.
Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
ఇటీవల కొందరు పోలీసులు సహోద్యోగులను బెదిరించి అత్యాచారాలు చేయడం, ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన వారి పట్ల నీచంగా వ్యవహరించడం వంటి సంఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొన్నిచోట్ల అయితే.. వావివరసలు లేకుండా.. అన్నలు, కన్నవాళ్లు, తమ్ముళ్లు సైతం.. తమ వాళ్లపట్ల పశువుల మాదిరిగా ప్రవర్తించిన సంఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. కొందరు కన్నవాళ్లు తమ మాటకాదన్నారని.. తమ పిల్లల్ని ఏంచేయడానికైన వెనుకాడటంలేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
కర్ణాటక లోని ఉడుపిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతి తమ సమీప బంధువు పిల్లాడిని ఇష్టపడింది. ఇదికాస్త ఇంట్లో తెలియడంతో పలు మార్లు గొడవలు జరిగాయి. కానీ యువతి మాత్రం.. అతడినే బలవంతంగా బైటకు వెళ్లిపోయి పెళ్లిచేసుకుంది. అప్పటి నుంచి ఆమె తండ్రి కోపంపెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల యువకుడ్ని పట్టుకుని, బంధించి అతని ఫోన్ లను తీసుకున్నాడు.
అందులో తన కూతురు ప్రైవేటు వీడియోలను తన ఫోన్ కు పంపించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అవి కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇది యువతికి తెలియడంతో ఆమె ఒత్తిడికి లోనై.. ఆత్మహత్యకు పాల్పడింది. సమయానికి ఆమె బంధువులు ప్రాణాలు కాపాడారు. ఈ నేపథ్యంలో కన్నకూతురి పట్ల ఇలా వ్యవహరించడం పట్ల తల్లి దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తనకు ఇష్టంలేని సంబంధాన్ని కూతురు పెళ్లి చేసుకున్నందుకు, తండ్రి ఇలా చేసినట్లు కొందరు చెప్పుకుంటున్నారు.ఈ ఘటన మాత్రం కన్నడ నాట తీవ్ర సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి