Panipuri Father: కుమార్తె పుట్టిన రోజు.. 1.10 లక్షల పానీపూరీలు పంచిన తండ్రి! ప్రేమంటే ఇదే
Father celebrates his daughters 1st birthday by distributing free Panipuri. కూతురు పుట్టిన రోజు సందర్భంగా తండ్రి రోజంతా ప్రజలకు ఉచితంగా పానీపూరి తినిపించాడు.
Father distributed 1.10 lakh free Panipuri on daughter's first birthday: ఒకప్పుడు కూతుళ్లను తల్లిదండ్రులు భారంగా భావించేవారు. ఇంట్లో కూతురు ఉంటే గుండెలమీద కుంపటి అనుకునేవారు. ప్రస్తుతం ఆ ఆలోచన విధానంలో పెను మార్పు వచ్చింది. కొడుకు ఒక్కడుంటే చాలు అనుకొనే పాతకాలం నాటి ఆలోచనలు పోయి.. కొడుకైనా, కూతురైనా ఒక్కటే అనే భావన వచ్చింది. కొందరు తల్లిదండ్రులు అయితే కూతురే పుట్టాలని అనుకుంటున్నారు. అంతేకాదు కూతురు పుడితే పెద్ద పండగ చేస్తున్నారు. తాజాగా భోపాల్‌లోని ఓ పానీ పూరీ వ్యాపారి ఇదే చేశాడు. కూతురు పుట్టిన రోజు సందర్భంగా రోజంతా ప్రజలకు ఉచితంగా పానీపూరి తినిపించాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని కోలార్ వీధిలో ఆంచల్ గుప్త అనే పానీపూరీ వ్యాపారి ఉన్నాడు. ఆంచల్‌కు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. మొదటి సంతానంలోనే ఆడపిల్ల పుట్టాలని ఆ దేవుడిని కోరుకున్నాడు. కానీ మెగ పిల్లాడు పుట్టాడు. ఆపై రెండో సంతానంగా 2021 ఆగస్టు 17న కుమార్తె పుట్టింది. దాంతో ఆంచల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజును పెద్ద పండగలా చేసుకున్నాడు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆంచల్ చాలా ఆనందంగా ఉన్నాడు.
ఇక 2022 ఆగస్టు 17న ఆంచల్ గుప్త కుమార్తె మొదటి పుట్టిన రోజు. కూతురు మొదటి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రజలకు పానీపూరి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఓ వెయ్యో, పది వేలో కాకూండా.. ఏకంగా 1,10,000 ఉచిత పానీపూరీలు ప్రజలకు పంచాలనుకున్నాడు. బుధవారం రోజున భోపాల్‌లో 31 స్టాల్స్ ద్వారా ఒక లక్ష్య పది వేల ఉచిత పానీపూరిలు పంపిణీ చేశాడు. పానీపూరి తిన్న ప్రజలు చిన్నారి బాగుండాలని దీవెనలు అందించారు. దాంతో ఆంచల్ తెగ ఆనందపడిపోయాడు. ఈ న్యూస్ దేశమంతగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆడపిల్ల అంటే ఇస్తామని, ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించేందుకే ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదని ఆంచల్ గుప్త తెలిపాడు. 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానన్నాడు. 'ఆడబిడ్డ పుట్టడంతో నా కల నిజమైంది. నాకు పెళ్లయినప్పటి నుంచి ఎప్పుడూ కూతురే పుట్టాలని అనుకునేవాడిని. కానీ రెండేళ్ల క్రితం నాకు కొడుకు పుట్టాడు. అనంతరం కూతురు పుట్టింది. కూతుళ్లతోనే భవిష్యత్తు సాధ్యమవుతుందని నేను నమ్ముతా' అని ఆంచల్ మీడియాతో చెప్పాడు.
Also Read: Shikhar Dhawan: శిఖర్ ధావన్ అరుదైన ఘనత.. సచిన్, ధోనీ, కోహ్లీ సరసన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook