Interim Budget 2024: అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు శుభవార్త తెలిపిన ఆర్థిక మంత్రి
2024 Budget On Health Sector: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడి కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో పెద్దగా ప్రకటనలు చేయలేదు కానీ.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆరోగ్య రంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.
2024 Budget On Health Sector: ఆరోగ్య రంగంలో నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ..పేదలు, యువత, మహిళలు, అన్నదాతపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో మహిళల కోసం ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అందులో గర్భాశయ క్యాన్సర్‌కు వ్యాక్సినేషన్‌ను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్లు గల బాలికలకు టీకాలు వేస్తామని తెలిపారు.
అలాగే అంగన్‌వాడీలు, పోషకాహారం 2.0 పౌష్టికాహార పంపిణీ, బాల్య సంరక్షణ, అభివృద్ధిని వేగవంతం చేస్తుందని తెలిపారు ఆర్థిక మంత్రి. అంతేకాకుండా త్వరలో U-win యాప్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని తెలియజేశారు. మిషన్ ఇంద్రధనుష్ టీకాని U-win యాప్ ద్వారా ముందుకు తీసుకువెళతారని చెప్పారు.
ఈ బడ్జెట్‌లో ఆశా, అంగన్‌వాడీలకు శుభవార్త తెలిపారు ఆర్థిక మంత్రి. ప్రధాని ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీలు అన్నిఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు విస్తరిస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో మరికొన్ని పెద్ద విషయాల గురించి ప్రసంగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌లో పన్ను రేట్లు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి పన్ను రేట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. అలాగే Fy25లో 11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్ 2024 రూఫ్‌టాప్ సోలార్ ద్వారా కోటి గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. భారతదేశం 2030 నాటికి 100 మెట్రిక్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసి ద్రవీకృతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook