తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయుష్ గోయల్
తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తరపున మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకన్నా ముందుగా పీయుష్ గోయల్ పార్లమెంట్‌కు చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై మధ్యంతర బడ్జెట్‌ను ఆమోదించింది. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రానున్న నాలుగైదు నెలలకు సంబంధించిన పద్దులను మాత్రమే ఈ మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెడతారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటు కానున్న 17వ లోక్ సభ ఆధ్వర్యంలో మళ్లీ సమావేశమయ్యే పార్లమెంట్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.
సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లో కొత్త సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేయరనే అభిప్రాయం ఉన్నప్పటికీ.. ఈ బడ్జెట్‌లో ఎన్డీఏ సర్కార్ మధ్య తరగతి, రైతులకు కాస్త ఊరట కలిగించడంతోపాటు ఆదాయ పన్ను పరిమితిని సైతం పెంచే అవకాశం ఉందని కేంద్ర కేబినెట్ వర్గాలు ముందు నుంచి చెబుతూ వస్తున్నాయి.