UP CM Yogi Adityanath Deepfake video viral: డీప్‌ఫేక్‌ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా వీటిని మాత్రం అరికట్టలేకపోతుంది. సెలబ్రెటీలే లక్ష్యంగా ఈ డీప్‌ఫేక్‌ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు కేటుగాళ్లు. తొలుత సినీ నటి రష్మిక మంధాన డీప్‌ఫేక్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా యూపీ సీఎం (UP CM) యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ఈ డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు. డయాబెటిస్‌ ఔషధానికి యోగి ప్రచారం చేస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. ఇందులో ఆయన ఓ న్యూస్‌ ఛానల్‌ క్లిప్‌లో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఈ ఘటనపై  సైబర్‌ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రెస్‌ ఆధారంగా ఈ వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న ఇలాంటి వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. వీటి కట్టడికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కేటుగాళ్లు ఏదో రూపంలో వీడియోలను సృష్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించి వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులను కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ డీప్‌ఫేక్‌ బారిన పడినవారిలో రష్మిక మందన్న, కత్రినా కైఫ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, కాజోల్‌, ఆలియా భట్‌ ఉన్నారు. సచిన్ ఓ గేమింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా, విరాట్‌ కోహ్లీ ఓ బెట్టింగ్‌ యాప్‌ను ప్రచారం చేస్తున్నట్లుగా చూపించారు. 


Also Read: Miss World 2024: మిస్ వరల్డ్ 2024 కిరీటం గెల్చుకున్న చెక్‌ రిపబ్లిక్‌ భామ


Also Read: Arun Goel: లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్య ట్విస్ట్‌.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి