FIR on Sundar Pichai: సుందర్ పిచాయ్‌కి నిన్న పద్మ పురస్కారం- నేడు కాపీరైట్ కేసు!
FIR on Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ముంబయిలో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. బాలీవుడ్ దర్శకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
FIR on Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై భారత్‌లో కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద ముంబయిలో ఈ కేసు నమోదు చేశారు (Copyright case Sundar pichai, ) పోలీసులు. సుందర్ పిచాయ్‌తో పాటు కంపెనీకి చెందిన మరో ఐదుగురిపైనా ఇదే కారణంతో కేసు నమోదైంది.
ఇంతకి అసలు విషయం ఏమిటంటే..
బాలీవుడ్ డైరెక్టర్ సునీల్ దర్శన్.. తాను తీసిన 'ఏక్ హసీనా తి ఏక్ దివానా థా' సినిమాను (Ek Haseena Thi Ek Deewana Tha) గుర్తు తెలియని వ్యక్తులు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేందుకు అనుమతి నిచ్చినందుకు.. ఈ విషయంపై కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కారణంతో ముంబయి కోర్టును ఆశ్రయించారు. సునీల్ దర్శన్ (Film director Suneel Darshan) పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు గూగుల్ సీఈఓ సుందర్ పించాయ్ సహా ఆ సంస్థకు చెందిన ఐదుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో ఈస్ట్ అధేరీలోని ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 51,63, 69 కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు కూడా ప్రారంభించారు (Case on Google CEO) పోలీసులు.
అయితే కేంద్ర ప్రభుత్వం నిన్న (మంగళవారం) సుందర్ పించాయ్కు పద్మ భూషణ్ (Padam award to Sundar Pichai) ప్రకటించింది. మరుసటి నాడే ఆయనపై కాపీరైట్ ఉల్లంఘన కింద కేసు నమోదవడం గమనార్హం.
'ఆ సినిమాపై పూర్తి హక్కులు నావే'
ఈ విషయంపై ఓ వార్తా సంస్థతో మట్లాడిన సునీల్ దర్శన్.. తన సినిమా రైట్స్ ఎవ్వరికి విక్రయించలేదని తెలిపారు. ఈ విషయంపై కొన్నాళ్లుగా యూట్యూబ్‌తో పోరాటం చేస్తున్నట్లు వివరించారు. అయినా తనకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని (Suneel Darshan case on Youtube) పేర్కొన్నారు.
'ఏక్ హసీనా తి ఏక్ దివానా థా' సినిమాపై పూర్తి హక్కులు తనకే చెందుతాయని. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దానిని అప్లోడ్ చేస్తున్నారని.. దాని ద్వారా ఆ వ్యక్తులతో పాటు యూట్యూబ్ కూడా డబ్బులు సంపాదిస్తున్నట్లు ఆరోపించారు.
Also read: Chhattisgarh: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్... వారానికి ఐదు రోజులే డ్యూటీ..
Also read: Bihar Protests: ఆర్ఆర్‌బీ ఫలితాలపై వివాదం.. అట్టుడుకుతున్న బీహార్.. రైలుకు నిప్పంటించిన విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook