కొవిడ్ ఆస్పత్రిలో Fire accident.. నలుగురు కరోనా రోగులు సజీవ దహనం
Fire accident at Covid-19 hospital: రాయ్‌పూర్: చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొవిడ్ 19 రోగులకు చికిత్స అందిస్తున్న రాజధాని ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు రోగులు అగ్నికి ఆహుతై సజీవ దహనమయ్యారు. ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు ఆస్పత్రిలోని కొవిడ్-19 పేషెంట్స్ వార్డుకి వ్యాపించాయి.
Fire accident at Covid-19 hospital: రాయ్‌పూర్: చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొవిడ్ 19 రోగులకు చికిత్స అందిస్తున్న రాజధాని ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు రోగులు అగ్నికి ఆహుతై సజీవ దహనమయ్యారు. ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు ఆస్పత్రిలోని కొవిడ్-19 పేషెంట్స్ వార్డుకి వ్యాపించాయి. ఆస్పత్రి సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది కొంతమంది రోగులను ఆస్పత్రి నుంచి బయటికి తీసుకొచ్చినప్పటికీ.. నలుగురు కరోనా (COVID-19) రోగులు మాత్రం ఆస్పత్రిలోనే చిక్కుకుని ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని జిల్లా ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు.
Also read : ఢిల్లీలో మళ్లీ Lockdown రానుందా ? అనుమానాలకు తావిచ్చిన CM Arvind Kejriwal ప్రకటన!
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంలో ఘటనలో నలుగురు మృతి చెందిన దుర్ఘటనపై చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ (Chhattisgarh CM Bhupesh Baghel) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Also read : Oxygen cylinders suppliers contacts: ఆక్సీజన్ సిలిండర్స్ కావాలా? ఇదిగో ఫోన్ నెంబర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook