Gujarat Fire Accident: దేశంలో కరోనా సంక్రమణ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు కోవిడ్ సెంటర్లలో, ఆసుపత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గుజరాత్‌లో జరిగిన ప్రమాదంలో 16 మంది రోగులు సజీవ దహనమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ధాటికి ప్రజానీకం బెంబేలెత్తిపోతోంది. ఓ వైపు ఆక్సిజన్ కొరత( Oxygen Shortage) మరోవైపు మందులు, బెడ్స్ కొరత. దేశం మొత్తం కరోనా మహమ్మారి ధాటికి విలవిల్లాడుతోంది. మరోవైపు కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రుల్లో తీవ్రమైన అగ్నిప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గుజరాత్‌(Gujarat fire Accident) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారుచ్‌లోని పటేల్ వెల్ఫేర్ కోవిడ్ ( Bharuch patel welfate covid hospital) ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు ( 16 Burt live). అందులో 14 మంది కరోనా రోగులు (14 Covid patients) కాగా..మరో ఇద్దరు స్టాఫ్ నర్శులున్నారు. 50 మంది రోగుల్ని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూలో మంటలు చెలరేగాయని పోలీసులు చెబుతున్నారు. పొగ అలముకోవడంతో 12 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారని భారుచ్ ఎస్పీ రాజేంద్ర సింహ్ తెలిపారు. 


భారుచ్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై తక్షణం దర్యాప్తుకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Gujrat cm vijay roopani) ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన రోగులు, వైద్య సిబ్బందికి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భారుచ్-జంబునగర్ హైవేపై ఉన్న 4 అంతస్థుల భవనంలోని ఈ ఆసుపత్రిని ఓ ట్రస్ట్ నిర్వహిస్తోంది. 


Also read: Supreme Court: మరో బీకామ్‌లో ఫిజిక్స్..సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook