COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Indian vaccine: కరోనా వైరస్‌కు దేశీయ వ్యాక్సిన్ సిద్ధమైంది. అత్యవసర వినియోగానికి ఆమోదం సైతం పొందింది. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కరోనా వైరస్ ( Corona virus ) నివారణకు ఇప్పటికే విదేశీ కంపెనీ వ్యాక్సిన్‌లు సిద్ధమయ్యాయి. ఇప్పుడిక తొలి స్వదేశీ వ్యాక్సిన్ కూడా సిద్దమైపోయింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech company ) అభివృద్ధి చేసి కోవ్యాగ్జిన్‌ ( Covaxin ) కు నిపుణుల కమిటీ అనుమతి మంజూరు చేసింది. అత్యవసర వినియోగం కోసం షరతులతో కూడిన అనుమతివ్వాల్సిందిగా డీసీజీఐకు సిఫార్సు చేసింది.


భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్‌కు అత్యవసర అనుమతివ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI ) కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణుల కమిటీ సమావేశమై..సుదీర్ఘంగా పరిశీలించింది. అనుమతివ్వచ్చంటూ సిఫార్సు చేసింది. మరోవైపు ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford - Astrazeneca ) సౌజన్యంతో మరో స్వదేశీ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum institute ) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ ( Covishield ) కు నిపుణుల కమిటీ ఆమోదించింది. ఇప్పుడీ రెండు వ్యాక్సిన్‌లకు డీసీజీఐ ఆమోదిస్తే..పంపిణీ ప్రారంభమైపోతుంది. 


Also read: Sourav Ganguly Health Updates: గంగూలీకి పూర్తయిన యాంజియోప్లాస్టీ