Rafale Fighter Jet : భారత వాయుసేనకు ( Indian Air Force ) మరింత బలం చేకూరనుంది. ఈనెల 29న రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale) ఫ్రాన్స్ నుంచి బయలుదేరి హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. తొలి విడతలో మొత్తం ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు సుమారు 7364 కిలోమీటర్లు ప్రయాణించి భారత్ చేరుకోనున్నాయి. ఎయిర్ టు ఎయిర్ ఫ్యూయల్ ( Air- To-Air ) రిఫిల్లింగ్ వ్యవస్థ, అత్యాధునిక సాంకేతికతో ఈ యుద్ధ విమానాలు శత్రువుల పాలిట కాలయముడిలా మారనున్నాయి రాఫేల్ విమానాలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శ్రీ రాపాకా స్వీటి ఘాటు అందాల హాటు ఫోటోలు )


ఫ్రాన్స్  ( France ) నుంచి నేడు ఈ యుధ్ధ విమానాలు ప్రారంభం కానున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE ) లోని ఫ్రెంచ్ ఎయిర్ బేస్ లో ఈ యుద్ధ విమానాలు ఒక సారి ఆగనున్నాయి. అనంతరం అవి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ చేరుకోనున్నాయి. మొత్తం 36 ఎయిర్ క్రాఫ్ట్ లు అందించేలా భారత్- ఫ్రాన్స్ మధ్య రూ.59 వేల కోట్లతో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు విమానాలు బుధవారం రోజు భారత్ చేరుకోనున్నాయి.


#SonuSoodRealHero:అరుంధతి విలన్..రియల్ లైఫ్ హీరో