LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇకపై LPG సిలిండర్ ను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇటీవలే ఇండేన్ గ్యాస్ ( Indane Gas ) తమ వినియోగదారులకు వాట్సాప్ బుకింగ్ కోసం కావాల్సిన నెంబర్ ను ఎస్సెమ్మెస్ చేసింది.
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇకపై లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) సిలిండర్ ను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇటీవలే ఇండేన్ గ్యాస్ ( Indane Gas ) తమ వినియోగదారులకు వాట్సాప్ బుకింగ్ కోసం కావాల్సిన నెంబర్ ను ఎస్సెమ్మెస్ చేసింది. అయితే నవంబర్ 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ విధానం పూర్తిగా మారింది. దాంతో పాటు ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ కూడా మారింది.
Also Read | Jack Ma: మాట జారిన అలీబాబా.. లక్షల కోట్లు నష్టం
ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ పై కాల్ చేయడంతో పాటు వాట్సాప్ ద్వారా ఇలా బుక్ చేసుకోవచ్చు
1. గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడటం.
2. మొబైల్ నెంబర్ పై కాల్ చేయడం
3.https://iocl.com/Products/Indanegas.aspx పోర్టల్ విజిట్ చేసి గ్యాస్ బుక్ చేయడం.
4. కంపెనీ వాట్సాప్ నెంబర్ పై మెసేజ్ చేయడం.
5. ఇండేన్ గ్యాస్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
Also Read | Hrithik Roshan: హాలీవుడ్ చిత్రంలో నటించనున్న హృతిక్ రోషన్
కాల్ చేయాల్సిన నెంబర్..
ఒకవేళ మీరు ఇండేన్ గ్యాస్ ( Gas ) వినియోగదారులు అయితే మీరు 7718955555 అనే నెంబర్ పై కాల్ చేసి బుక్ చేసుకోచ్చు.
వాట్సాప్ నెంబర్..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియను వాట్సాప్ ద్వారా చేయాలి అనుకుంటే మీరు 7588888824 అనే నెంబర్ పై మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే మీరు గ్యాస్ బుకింగ్ కోసం ఈ నెంబర్ పై మెసేజ్ చేయగలరు. దీని కోసం మీరు సింపుల్ గా REFILL అని టైప్ చేయాల్సి ఉంటుంది.
Also Read | LPG New Rules: గ్యాస్ బుక్ చేసే ముందు ఈ కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR