Five years to the demonetisation: పెద్ద నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు- కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
Congress on demonetisation: దేశాన్ని ఓ కుదుపునకు గురి చేసిన.. పెద్ద నోట్ల రద్దు నిర్ఱయానికి నేటితో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
Five to the demonetisation: పెద్ద నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు. నిజానికి నోట్ల రద్దు ఓ విపత్తు అని ఆమె అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమిటంటూ (Priyanka Gandhi Slams Demonetisation as Disaster) కేంద్రంపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
పెద్ద నోట్ల రద్దు విజయవంతమైతే..అవినీతి ఎందుకు అంతం కాలేదు? నల్లధనం ఎందుకు వెనక్కి రాలేదు? నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఎందుకు సాధ్యం కాలేదు? ఎందుకు ఉగ్రవాదాన్ని కట్టడి చేయలేదు? ద్రవ్యోల్బణాన్ని ఎందుకు నియంత్రించలేదు? అని ట్విట్ చేశారు.
నోట్ల రద్దు ఓ డిజాస్టర్..
మోదీ తీసుకున్న నోట్ల రద్దు ఓ డిజాస్టర్ అంటూ కాంగ్రెస్ (Congress on Demonetisation) పార్టీ ఆరోపించింది.
నకిలీ నోట్ల చలామణిని అరికట్టేందుకు.. 2016లో లక్ష్యంగా పెట్టుకుంటే.. ఇప్పుడు.. రూ.200 నోట్లలో 151 శాతం, రూ.500 నోట్లలో 37 శాతం నకీలీ నోట్ల వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. 2020లో ఆర్బీఐ గణాంకాల ఆధారంగానే ఈ లెక్కలు ఉన్నట్లు తెలిపింది.
Also read: NCB Drug Case Update: ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో విచారణకు ఆర్యన్ ఖాన్ డుమ్మా
Also read: Zycov D Vaccine: దేశంలో త్వరలో చిల్డ్రన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ
నోట్ల రద్దు ఇలా..
2016 నవంబర్ 8న అంటే సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. రూ..500, రూ.1,000 కరెన్సీలు అర్ధ రాత్రి నుంచి చెల్లుబాటుకావని తెలిపారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న నోట్లు మార్చుకునేందుకు (PM Modi on demonetisation) మాత్రం వీలుందని చెప్పారు.
దీనితో ఒక్క సారిగా ప్రజలు బ్యాంకులపై పడ్డారు. బ్యాంకుల్లో కూడా ఒక్కో వ్యక్తికి నిర్ణీత మొత్తం మాత్రమే మార్చుకునే వీలుందని చెప్పాయి. దీనితో బ్యాంకుల బయట జనాలు కీలోమీటర్ల (Demonetisation effects) మేర క్యూ కట్టారు.
Also read: Paytm IPO Details: నేటి నుంచి పేటీఎం ఐపీఓ షురూ.. రూ.8300 కోట్ల విలువైన షేర్లు విక్రయానికి రెడీ
Also read: Chennai floods: చెన్నైని ముంచెత్తుతున్న వరద నీరు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఎంకే స్టాలిన్
నోట్ల రద్దుకు కేంద్రం చెప్పిన కారణం ఏమిటి?
నోట్ల రద్దు ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్ లాంటిదని పేర్కొంది కేంద్రం. దీనితో పాటు దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనం మొత్తం బయటకు తీసేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది. అదే విధంగా డిజిటల్ చెల్లింపుల వైపు కూడా ప్రజలు మొగ్గు చూపుతారని కేంద్రం (aims of demonetisation) పేర్కొంది. సరిపడా నగదు చేతిలో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంపై కూడా కేంద్రం పలు మార్లు స్పందించింది.
Also read: Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే అందుబాటులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్
నోట్ల రద్దు ఉద్దేశాలు నేరవేరాయా?
నోట్ల రద్దు్తో కేంద్రం లక్ష్యాలు నెరవేరినట్లు 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. వెల్లడించారు. ఆర్థిక వ్యవస్త క్రమబద్దీకరణ జరిగిందని, పన్ను వసూళ్లు, డిజిటల్ చెల్లింపుల వంటి వాటిలో భారీగా వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు.
నోట్ల రద్దు ఓ బారీ కుంబకోణం అని కొంత మందికి లబ్ది చేకూర్చేందుకే కేంద్రం ఈ నిర్ఱణయం తీసుకుందని ప్రతిపక్షాలు మొదటి నుంచే ఆరోపిస్తున్నాయి. నోట్ల రద్దు వల్ల ఎఁతో మంది ఉపాధి కోల్పోయారని.. దేశానికి, ఆర్థిక వ్యవస్థకు ఈ నిర్ణయం పెద్ద గాయం చేసిందని కూడా అభిప్రాయపడ్డాయి.
Also read: Vicky Katrina Roka: పెళ్లికి సిద్ధమైన విక్కీకౌశల్ – కత్రినా.. దీపావళి రోజున జరిగిన రోకా ఫంక్షన్?
Also read: Chennai Floods Pics: చెన్నైను ముంచెత్తిన వరద దృశ్యాలు, అంతా జలమయం
నోట్ల చలామణి పెరిగిందంటున్న తాజా నివేదికలు..
పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులు పెరిగినా.. అదే స్థాయిలో నగదతు చలామణి కూడా పెరుగుతున్నట్లు ఆర్బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి. నోట్ల రద్దుకుకు ముందు (2016 నంవబర్ 4) దేశంలో రూ.17.74 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది. అక్టోబర్ చివరి నాటికి ఈ మొత్తం రూ.29.17 లక్షల కోట్లకు చేరింది. కరోనా కారణంగా ప్రజలు నగదును తమ వద్దే పెట్టుకోవడం కూడా ఇందుకు కారణంగా ఆర్బీఐ పేర్కొంది.
ఇక డిజిటల్ చెల్లింపుల విషయానికొస్తే.. అక్టోబర్‌లోనే అక్టోబరులో 421 కోట్ల డిజిటల్ లావాదేవీలు లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.7.71 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ మొత్తం కేవలం యూపీఐ ద్వారా మాత్రమే కావడం గమనార్హం. దీనితో పాటు.. ఇతర డిజిటల్ మాధ్యమాలు. డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల ద్వారా కూడా భారీగా లావాదేవీలు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
Also read: Vijay Sethupathi: ఆ దాడి ఘటనపై విజయ్ సేతుపతి ఏమన్నాడో తెలుసా
Also read: Delhi Air Pollution Today: ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం.. ప్రమాదకర స్థాయికి సూచీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook