Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద విలయం..22 మంది మృతి, పలువురు గల్లంతు..!
Heavy Rains: ఉత్తరాధిలో జల విలయం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా వరదలు సంభవించాయి.
Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. వరదల బీభత్సానికి 22 మంది మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో ఆరుగురు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. వారి కోసం గాలిస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు చోట్ల జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులన్నీ మూసివేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంగ్రా జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. నదులన్నీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. వరదల ధాటికి రైల్వే వంతెన కొట్టుకుపోయింది. దీంతో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. చక్కీ నదిపై నిర్మించిన బ్రిడ్జ్‌లోని పిల్లర్ కుప్పకూలింది. అనంతరం వరద నీటిలో కొట్టుకుపోయింది.
ఈదృశ్యాలు సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. గత వారం రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. కంగ్రా, కులు, మండి, ధర్మశాలలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ధర్మశాలలో ఈదురుగాలులకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఈక్రమంలో ప్రధాన రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.
మండి జిల్లాలో వానలు, వరదలతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈనెల 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సహాయకచర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఉత్తరాఖండ్‌లో వరద విలయం కొనసాగుతోంది. డెహ్రాడూన్‌లో ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తపకేశ్వర్ గుహ నీటిమయం అయ్యింది. సంగ్ నదిపై ఉన్న బ్రిడ్జ్ సైతం దెబ్బతింది. ముస్సోరిలోని కెంప్టీ జలపాతం ఉధీతంగా ప్రవహిస్తోంది.
Also read:PV Sindhu-Prabhas: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. హీరోయిన్‌గా చేస్తా: పీవీ సింధు
Also read:KCR Munugode Meeting: ఈడీ, బోడీలకు పెట్టుకో..ఏం పీక్కుంటావో పీక్కో..మోదీపై కేసీఆర్ ధ్వజం..
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook