రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ముఖ్యాంశాలు
కరోనావైరస్ పై దేశం చేస్తోన్న పోరాటంలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆత్మ నిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat ) పేరిట కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ఎకనమిక్ ప్యాకేజీ ( Economic package ) గురించి నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) మీడియాకు వివరించారు.
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై దేశం చేస్తోన్న పోరాటంలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆత్మ నిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat ) పేరిట కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ఎకనమిక్ ప్యాకేజీ ( Economic package ) గురించి నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) మీడియాకు వివరించారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారత్ అభివృద్ధి కుంటుపడిపోకుండాఉండకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా ప్రధాని మోదీ దీనిని రూపొందించారని ఆమె అభిప్రాయపడ్డారు. నిర్మలా సీతారామన్ వివరించిన ఎకనమిక్ ప్యాకేజీలోని పలు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
లాక్‌డౌన్ సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టపోయాయి.
చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఆర్థిక భారం తగ్గేలా ఈపీఎఫ్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మరో 3 నెలల పాటు పొడిగింపు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జూన్, జూలై, ఆగస్టు నెలలో ఈపీఎఫ్ భారాన్ని కేంద్రాన్ని భరిస్తుంది.
ఉద్యోగులకు ఆర్థిక భారాన్ని తగ్గించేలా ఈపీఎఫ్ వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు.
ఫలితంగా లబ్ధి పొందనున్న 70.22 లక్షల మంది ఉద్యోగులు.
ఈపీఎఫ్ చెల్లింపుల కోసం రూ. 2,500 కోట్లు కేటాయింపు.
రేపటి నుంచి మార్చి 2021 నాటి వరకు చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ 25 శాతం కుదింపు.
ఫలితంగా ఖాతాదారులకు 50 వేల కోట్ల రూపాయలు లబ్ధి.
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు రుణాలు.
అత్యవసరాల కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల రుణాలు
4 సంవత్సరాల కాలపరిమితితో రుణాలు మంజూరు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల రుణాలు
విద్యుత్ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు కేటాయింపు,
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు.
ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్ల కేటాయింపులు.
ప్రభుత్వ రంగ సంస్థలు రుణాల చెల్లింపు.
పీపీపీ కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగింపు.
ట్యాక్స్ రిటర్న్స్ తేదీ 31 జూలై నుంచి నవంబరు 30 వరకు పొడిగింపు.
రూ. 200 కోట్ల వరకు వివిధ గ్లోబల్ టెండర్లలో కేవలం భారతీయ కంపెనీలను మాత్రమే అనుమతించేలా కేంద్రం చర్యలు.