రాంచీ స్పెషల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టు గడ్డి కుంభకోణానికి సంబంధించి లాలూకు శిక్ష ఖరారు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుతో లాలూతో పాటు మరో 14 మందిని కోర్టు దోషులుగా గుర్తించిన సంగతి తెలిసిందే..! అయితే గురువారం శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా.. న్యాయవాది మృతి కారణంగా సంతాప సూచికగా కేసు వాయిదా పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విచారణ సమయంలో, బీహార్ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్, జనతాదళ్(యునైటెడ్) నాయకుడు జగదీష్ శర్మ, మాజీ బీహార్ డైరెక్టర్ జనరల్ డి.పి. ఓజా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులని కోర్టు వెల్లడించింది. జనవరి3న న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మరణం కారణంగా కోర్టు శిక్ష ఖరారును వాయిదా వేసింది. 


కోర్టులో లాలూ కుమారుడు తేజస్వి యాదవ్, ఇతర పార్టీ నాయకులు రఘువంష్ ప్రసాద్ సింగ్, మనోజ్ ఝా కోర్టు ధిక్కారం చేశారని  కోర్టు గుర్తించింది. డిసెంబరు 23న పశుగ్రాసం కుంభకోణంలో 900కోట్లు గోల్మాల్ విషయంలో ఆర్జేడీ చీఫ్, మరో 14 మందిని దోషులుగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో సహా ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే..!