'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కానీ కొంత మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీయ పౌరులు ఇలా చేస్తే వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ వారికి శిక్షలు కూడా వేయిస్తున్నారు. కానీ విదేశీ పౌరులు లాక్ డౌన్ ఉల్లంఘిస్తే ఏం చేయాలి..? ఇదే సందేహం వచ్చింది ఉత్తరాఖండ్ పోలీసులకు. అప్పుడు వారు ఏం చేశారో తెలిస్తే .. ఔరా అనిపిస్తుంది. 


ఉత్తరాఖండ్.. రాష్ట్రంలోని చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా రిషికేష్, నైనిటాల్ లాంటి ప్రాంతాలు విదేశీ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఐతే లాక్ డౌన్ ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులు.. లాక్ డౌన్ నిబంధనలు తెలియక.. స్వేచ్ఛగా విహరిస్తున్నారు. 


[[{"fid":"184262","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అలా 10 మంది విదేశీ పర్యాటకులు గంగా నది ఒడ్డున విహరిస్తూ పోలీసుల కంటపడ్డారు. లాక్ డౌన్ ఉంది కాబట్టి.. మీరు బస చేస్తున్న హోటల్ గదులకు వెళ్లిపోవాలని  వారిని పోలీసులు కోరారు. కానీ మాకేం రూల్స్... అన్న విధంగా మాట్లాడడంతో.. విదేశీ పర్యాటకులతో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. వారికి పెన్ను, పేపర్ ఇచ్చి ఇంపోజిషన్ రాయించారు. నేను లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించాను. నన్ను క్షమించండి.. అని ఇంగ్లీషులో వారితో రాయించారు. ఒక్కొక్కరిని ఈ రెండు వాక్యాలు 5 వందల సార్లు రాయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేం లేక.. 5 వందల సార్లు ఆ రెండు వాక్యాలు రాసి..హోటల్ గదులకు వెళ్లిపోయారు టూరిస్టులు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..