వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, లైఫ్ సపోర్ట్ పైనే ఉన్నారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపటిలో ఎయిమ్స్‌ ఆసుపత్రికి చేరుకోనున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించిందన్న సమాచారం రావడంతో బుధవారం రాత్రి ఆయనను పరామర్శించిన మోదీ మరొకసారి ఆసుపత్రికి రానున్నారు.


గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయిని  సందర్శించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఎయిమ్స్‌కు వచ్చి వాజ్‌పేయిని పరామర్శిస్తున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయిని అమిత్ షా, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్, సుష్మా స్వరాజ్, జేపీ నడ్డా, జవదేకర్, విజయ్ గోయల్, పలువురు కేంద్రమంత్రులు, వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత తదితరులు పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆటు వాజ్‌పేయి ఆరోగ్య సమాచారం తీసుకున్న ఆయన కుటుంబసభ్యులు గ్వాలియర్ నుంచి ఢిల్లీలోని వాజ్‌పేయి నివాసానికి చేరుకున్నారు.


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్ వచ్చి వాజ్‌పేయిని పరామర్శించి వెళ్లారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎయిమ్స్ వర్గాలు సమాచారం చేరవేస్తున్నారు. అటు ఐసీయూ ఉన్న వాజ్‌పేయి ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు.


కాగా వాజ్‌పేయి ఆరోగ్యం బాగుపడాలంటూ పలువురు హోమాలు నిర్వహిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీ పార్టీ తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.