న్యూఢిల్లీ: చాతిలో నొప్పి కారణంగా శ్వాస తీసుకవడంలో ఇబ్బందికరంగా మారడంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 87 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలోని కార్డియో-థొరాసిక్ వార్డులో వైద్యుల పరిశీలనలో ఉన్నారని ఆకుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, సుమారు రాత్రి 8.45 గంటల సమయంలో ఎయిమ్స్ కు చేరున్నారని అన్నారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ ఆధ్వర్యంలో మెడికేషన్ కొనసాగుతుందని అన్నారు. 2009లో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో కొరోనరీ బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఛుక్ ఛుక్ రైలు వచ్చేస్తోంది..


కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడిగా రాజస్థాన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా 2004 నుండి 2014 వరకు పది సంవత్సరాల పాటు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. ఈ వార్త వెలువడగానే, అనేక మంది నాయకులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జి ఎయిమ్స్‌లో చేరడం చాలా ఆందోళనగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు.


కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ స్పందిస్తూ డాక్టర్ సాహెబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ట్వీట్ చేస్తూ.. డాక్టర్ మన్మోహన్ సింగ్ జి ఆసుపత్రిలో చేరిన వార్తలను చూశాను. మన్మోహన్ సింగ్ జి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాని అన్నారు. వినయపూర్వకమైన, తెలివైన పండితుడని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..