Former PM Manmohan Singh admitted to AIIMS Delhi: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్(Former PM Manmohan Singh) ఆరోగ్యం మంగళవారం అకస్మాత్తుగా క్షీణించింది. ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తింది. దీంతో ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని కార్డియో-న్యూరో టవర్‌కు తీసుకెళ్లారు. డాక్టర్ రణ్ దీప్ గులేరియా, ఎయిమ్స్ నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: UP Rape: నాపై 28 మంది అత్యాచారం చేశారు..అందుకు మా నాన్నే కారణం..!


మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా(coronavirus) బారిన పడ్డారు. దీంతో ఆయనను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత మార్చి 4, ఏప్రిల్ 3 న రెండు మోతాదుల కరోనా వ్యాక్సిన్‌(Covid Vaccine)లను కూడా తీసుకున్నారు. 2009 లో మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడు(Rajyasabha Member)గా కొనసాగుతున్నారు. అతను 2004 నుండి 2014 వరకు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook