APJ Abdul Kalam: నేడు భారత మాజీ రాష్ట్రపతి ఏ.పీ.జే అబ్ధుల్ కలాం వర్ధంతి..యావత్ భారతానికి చెప్పిన సూక్తులు ఇవే..!
APJ Abdul Kalam Death Anniversary: ఇవాళ భారత మాజీ రాష్ట్రపతి ఏ.పీ.జే అబ్ధుల్ కలాం వర్ధంతి. ఈసందర్భంగా ప్రపంచానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలను ఇప్పుడు చూద్దాం..
APJ Abdul Kalam Death Anniversary: తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న భారత మాజీ రాష్ట్రపతి ఏ.పీ.జే అబ్ధుల్ కలాం జన్మించారు. చిన్నతనం నుంచి అంచెలంచెలు ఎదుగుతూ పైకి వచ్చారు. భారత అత్యున్నత పదవిని అధిరోహించారు. ఆయనను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2002-2007 మధ్య భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆ పదవికి ఆయన వన్నె తెచ్చారు. ఎంతో హుందా నడుచుకుంటూ..ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పీపుల్స్ ప్రెసిడెంట్‌గా పేరుగాంచిన కలాం అణు విజ్ఞాన శాస్త్రానికి ఎంతో సేవ చేశారు. దీంతో ఆయన భారతరత్న అందుకున్నారు. ఎన్నో రంగాల్లో రాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 1998 పోఖ్రాన్-2 అణు పరీక్షలో కీలక పాత్ర పోషించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు డీఆర్డీవోతో కలిసి పనిచేశారు. అంతటి మహోన్నత వ్యక్తి యావత్ దేశానికి అందించిన స్ఫూర్తిదాయకమైన కొన్ని మంచి మాటలను చూద్దాం..
- మొదటి విజయం సాధించిన తర్వాత విశ్రాంతి తీసుకోకండి..ఎందుకంటే ఆ తర్వాత రెండో విజయంలో విఫలమయ్యితే..మీ మొదటి విజయం కేవలం అదృష్టం కొద్ది వచ్చిందని కొందరు పెదవిరుస్తారు.
-నిద్రిస్తున్న సమయంలో మీరు చూసేది కల కాదు..అది మిమ్మల్ని నిద్రపోనివ్వని విషయం.
- ఉన్నత వ్యక్తులకు మతం అనేది స్నేహితులను సంపాదించడానికి ఓ మార్గం..అదే సామాన్యులు ఆ మతాన్ని పోరాట సాధనంగా చేసుకుంటారు.
- ప్రశాంతమైన జీవితానికి రెండు నియమాలు వివరించారు..వైఫల్యంలో నిరాశను ఎప్పటికీ హృదయానికి వెళ్లకూడదు. విజయంతో అహం మెదడుకు ఎప్పటికీ వెళ్లకూడదు.
- మీద పాదాలను ఇసుకపై విడిచిపెట్టాలనకుంటే..పాదాలను వెనక్కి తీయవద్దు.
- మీరు మీ భవిష్యత్తును మార్చుకోలేరు..కానీ మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు..అలా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తుంది.
- మనందరికీ ఒకేలా ప్రతిభ ఉండదు...కానీ మన ప్రతిభను పెంపొందించుకునేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి.
- ఒకవేళ మనం విఫలమయితే..ఎన్నడూ దానిని వదులుకోవద్దు..ఎందుకంటే ఫెయిల్ అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం.
Also read:Actor Nithin: కుల వివాదంలో నితిన్ దర్శకుడు.. ఆ కులాలపై దారుణ వ్యాఖ్యలు!
Also read:Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో మరో ట్వీస్ట్..నిందితులకు బెయిల్ మంజూరు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook