Margaret Alva: విపక్షాల తరపున ఉపరాష్ట్రపతి ఎవరన్న ఉత్కంఠ వీడింది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పేరును ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ వెల్లడించారు. గతంలో కేంద్రమంత్రిగా మార్గరెట్ పనిచేశారు. కర్ణాటకకు చెందిన ఆమె ..గోవా, రాజస్థాన్, గుజరాత్ గవర్నర్‌గా పనిచేశారు. సుదీర్ఘ మంతనాలు తర్వాత మార్గరెట్ పేరును ఖరారు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరు ప్రకటించారు. తాజాగా విపక్షాలు తమ అభ్యర్థి పేరును ఖరారు చేశారు. రేపు రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా పేరును 17 పార్టీలు బలపర్చాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ తెలిపారు. మంగళవారం ఆమె నామినేషన్‌ వేస్తారని ప్రకటించారు. దీనిపై మార్గరెట్ స్పందించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 




Also read:CM Kcr: వరద బాధితులకు అండగా ఉంటాం..ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..!


Also read:Corona Vaccination: దేశంలో కొనసాగుతున్న టీకా ఉద్యమం.. 200 కోట్ల మార్క్‌ దాటిన వ్యాక్సిన్..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.