J&K: జమ్మూలో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీరులో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
Four terrorists killed in Jammu: జమ్మూ: జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎన్‌కౌంటర్ జరిగింది. అప్రమత్తమైన భద్రతా దళాలు జాతీయ రహదారిని మూసివేశాయి. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో సైనికులు సైతం పాల్గొన్నారు. అనంతరం ఉగ్రవాదులకు చెందిన 11 ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్‌పీఎఫ్ పేర్కొంది. వీరంతా జైష్-ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని వెల్లడించింది. అయితే ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం సెర్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు జమ్మూజోన్ ఐజీ ముఖేష్ సింగ్ తెలిపారు. వారు డీడీసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. Also read: Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్
ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియోను వీక్షించండి..
ఇదిలాఉంటే.. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రెనెడ్ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడి చేశారు. అది తప్పి పౌరులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. దాడి తర్వాత పుల్వామాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి