Fourth Wave alert: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం.. కొత్త కేసులు ఎన్నంటే?
India Covid-19 Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 20,408 మందికి వైరస్ సోకింది. మహమ్మారితో మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు.
India Covid-19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,408 మందికి వైరస్ పాజిటివ్ (Corona cases in India)గా నిర్ధారణ అయింది. వైరస్ తో మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 20,958 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. దేశంలో మెుత్తం కేసుల సంఖ్య 4,40,00,138కి చేరగా..టోటల్ మరణాల సంఖ్య 5,26,312గా ఉంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,33,30,442 నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.05 శాతానికి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో ప్రస్తుతం 1,43,384 కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో 4,04,399 మందికి కొవిడ్ టెస్టులు చేశారు. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం 33,87,173 మందికి వ్యాక్సినే వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 203.94 కోట్లు దాటింది.
వరల్డ్ వైడ్ గా కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 8,36,173 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి కారణంగా మరో 1,917 మంది ప్రాణాలు విడిచారు. జపాన్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 2,30,055 కేసులు వెలుగుచూడగా.. మరో 116 మంది మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో 99,061 కేసులు నమోదు అయ్యాయి.
Also Read: Voter ID: ఇకపై 17 ఏళ్లకే ఓటు హక్కు..కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook