Fourth Wave Alert: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?
India Covid-19 Update: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. కొత్తగా 8,582 మందికి వైరస్ సోకింది. వైరస్ తో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Covid-19 Fourth Wave in India: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 8,582 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in India) గా నిర్ధారణ అయింది. మహమ్మారి బారిన పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం వైరస్ నుంచి 4,143 మంది కోలుకున్నారు. దీంతో మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 98.69 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా నమోదైంది.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన మెుత్తం కరోనా కేసుల సంఖ్య 43,214,777 కాగా... మరణాల సంఖ్య 5,24,761గా ఉంది. ప్రస్త్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44,513గా ఉంది. దేశవ్యాప్తంగా నిన్న మరో 3,16,179 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ (Covid-19 Vaccination in India)కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 13,04,427 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,07,08,541కు చేరింది.
వరల్డ్ వైడ్ గా కరోనా కల్లోలం కొనసాగుతోంది. శనివారం 3, 82,377 కేసులు వెలుగుచూశాయి. వైరస్ తో మరో 929 మంది ప్రాణాలు కోల్పోయారు. తైవాన్‌లో 79,663 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 211 మరణాలు చోటుచేసుకున్నాయి. జర్మనీలో 44,642 మంది కొవిడ్ సోకింది. మరో 65 మంది ప్రాణాలు విడిచారు.
Also Read: ITBP Recruitment 2022: కేవలం ఇంటర్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి