Job vacancies: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా ఉద్యోగాలు- పూర్తి వివరాలు ఇవే..
Job vacancies: ఉద్యోగం కోసం వెతుకున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ వారం నుంచి పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Job vacancies: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ ఖాలీలకు సంబంధించి ఈ వారం నుంచి నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు (Jobs News) ఉన్నాయి? దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ ఎప్పుడు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ఆర్మీ..
ఆర్మీలో వివిధ విభాగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ(Jobs in Indian Army). జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ కాంట్‌లోని సిక్కు రెజిమెంటల్ సెంటర్‌కు సంబంధించి పలు పోస్టు్లకోసం ఈ ప్రక్రియ జరగనుంది. ఇందులో ఓబీసీలకు రిజర్వ్ చేసిన లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్‌లు సహా.. నాలుగు కుక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు (Indina Army Jobs news) చివరి తేదీ జనవరి 8.
టెర డేటా సాఫ్ట్వేర్..
అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ టేరా డేటా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల (Jobs in Tera Data) ఉద్యోగ నియామకాలు చేపట్టింది. హైదరాబాద్ క్యాపంస్ కోసం ఈ నియామకాలు (Jobs in Hyderabad) జరుగుతున్నాయి. ఇదే రంగంలో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు.. ఫ్రెషర్స్‌కు కూడా అవకాశాలిస్తుస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి బీఈ, బీటెక్ విద్యార్హతలుగా నిర్ణయించింది.
ఎస్ఎస్సీ సీజీఎల్ రిక్రూట్మెంట్ 2021
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) టైర్ 1 ఎక్జామినేషన్ 2021 కోసం దరఖాస్తులు (SSC Jobs) స్వీకరిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో గ్రూప్ బీ, సీ విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుక 2022 జనవరి 23 చివరి తేదీ.
టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు..
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫ్రెషర్స్‌కు భారీగా ఉద్యోగ అవకాశాలు (TCS Job opportunities for freshers) ప్రకటించింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (బీపీఎస్) పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌లో డిగ్రీ ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 7 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. జనవరి 26 నుంచి రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలు (IT Job vacancies) ఉంటాయి.
ఇండియన్ కోస్ట్ గార్డ్..
నావిక్, యాత్రిక్ పోస్ట్‌లలో 322 ఖాళీలకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఇండియన్ కోస్ట్ గార్డ్.ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 4న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 14. పురుషుల విభాగంలో మాత్రమే ఈ ఖాళీలు ఉన్నాయని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.
Also read: Corona cases in India: దేశంలో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook