పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు మళ్లీ పెరిగాయి. ఇటీవలే మండుతున్న ఇంధన ధరలు నేపథ్యంలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.50 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరగా.. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించి సామాన్యుడికి కొంతమేర ఊరట కల్పించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే జైట్లీ ప్రకటన మరుసటి రోజే పెట్రో మంట సన్నగా రాజుకుంది. సోమవారం(అక్టోబర్ 8, 2018) దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ 21 పైసలు పెరిగి రూ.82.03కి, డీజిల్‌ 29 పైసలు పెరిగి రూ.73.82కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌‌పై 21 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెరుగగా.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.50, డీజిల్‌ రూ.77.37గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.83.87, డీజిల్ రూ.75.67గా ఉంది. ఇక చెన్నై నగరంలో కూడా లీటర్ పెట్రోల్ రూ.85.26, డీజిల్ రూ.78.04గా ఉంది.


అటు హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.96, డీజిల్‌ రూ.80.30, విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.22, డీజిల్‌ రూ.79.21గా ఉంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. (మూలం: ఐఓసీఎల్ వెబ్ సైట్)