Petrol prices: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ``లో ఎమిషన్ BS-VI`` పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు.
న్యూ ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఐఓసీఎల్ చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇంధనం ధరలు పెరగనున్నాయని పీటీఐ ఓ కథనంలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ''లో ఎమిషన్ BS-VI'' పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు. ఈ సరికొత్త ఇంధనం తయారీకి అవసరమైన అధునాతన పరిజ్ఞానం వినియోగం కోసం తమ రిఫైనరీలపై రూ.17,000 కోట్ల వరకు వెచ్చించామని.. అందువల్లే ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న లో ఎమిషన్ బిఎస్-VI పెట్రోల్, డీజిల్‌కి ధరలు కూడా పెరుగుతాయని సంజీవ్ సింగ్ అన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) అన్నీ ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కోసం రూ.35,000 కోట్లు ఖర్చుపెడితే... అందులో ఒక్క ఐఓసిఎల్ చేసిన ఖర్చే రూ.17,000 కోట్లు ఉందని సంజీవ్ సింగ్ పేర్కొన్నారు.
లో ఎమిషన్ BS-VI ఇంధనం సరఫరా అవుతున్న అన్ని దేశాల్లోనూ అక్కడి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మామూలు ఇంధనం ధరల కంటే అధికంగానే చార్జ్ చేస్తున్నాయని సంజీవ్ వెల్లడించారు.
లో ఎమిషన్ BS-VI ఏంటంటే...
సంజీవ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్‌లో 50 పార్ట్స్ పర్ మిలియన్ (50 parts per million (ppm)) కలిగి ఉంటుంది. అదే ఎప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న లో ఎమిషన్ బిఎస్-VI ఇంధనంలో (low emission BS-VI fuels) 50 పార్ట్స్ పర్ మిలియన్ (10 parts per million (ppm)) కలిగి ఉంటుంది. అంటే బిఎస్-4 రకం ఇంధనంతో పోల్చుకుంటే.. బిఎస్-6 రకం ఇంధనంలో ఉండే సల్ఫర్, నైట్రోజెన్ ఆక్సైడ్ పరిమాణం ఐదు రెట్లు తక్కువగా ఉంటుంది. కాలుష్యానికి చెక్ పెట్టడానికి లో ఎమిషన్ బిఎస్-6 రకం ఇంధనం ఎంతో ఉపయోగపడనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..