G20 Summit Day 1: జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఇండియా తొలిసారి ఆతిధ్యమిస్తోంది. ప్రపంచ ఆగ్రరాజ్యాలు కొలువుదీరిన సదస్సుకు ఇండియా నేతృత్వం వహించింది. మొరాకోలో సంభవించిన భారీ భూకంపంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రారంభోపన్యాసమిచ్చారు ప్రధాని మోదీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ20 సదస్సు జరుగుతున్న భారత్ మండపం వద్ద ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాధినేతలకు స్వాగతం పలికారు. స్వాగతం పలికేటప్పుడు మోదీకు వెనుక నేపధ్యంలో కోణార్క్ చక్రం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ చక్రం సమయం, పురోగతి, నిరంతర మార్పును సూచిస్తోంది. కోణార్క్ చక్రం గురించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా వివరించారు. అనంతరం మొరాకోలో సంభవించిన భారీ భూకంపంపై విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు సహాయం అందించేందుకు ఇండియా అండగా ఉంటుందని ఆపన్నహస్తం అందించారు. 


అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, రష్యా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమసోఫా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్‌యోల్, ఇటలీ ప్రధాని జియోర్జియో మెలానీ, జపాన్ ప్రధాని కిషిదా, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లేయన్ , చైనా తరపున ఆ దేశ మంత్రి లీ కియాంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్ ఛాన్సెలర్ ఓలాఫ్ స్కాల్డ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో తదితరులు హాజరయ్యారు. 


ఇవాళ తొలిరోజు ఉదయం 109.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ వన్ ఎర్త్ సమ్మిట్ జరగనుంది. ఆ తరువాత అంటే మద్యాహ్నం 3 గంటల వరకూ ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. సెషన్ 2లో మద్యాహ్నం 3 గంటల నుంచి 4.55 గంటల వరకూ వన్ ఫ్యామిలీ సమ్మిట్ జరగనుంది. రాత్రి 7-8 గంటల మధ్యలో జీ20 దేశాధినేతల గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది. రాత్రి 8-9 గంటల మధ్యలో దేశాధినేతల డిన్నర్ ఉంటుంది.


Also read: Joe Biden's Air Force One Flight: ఢిల్లీలో దిగిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook