నా పేరు గాంధీ కాకపోయింటే.. నేనిప్పుడు ఎక్కడ ఉండేవాడినో అంటూ బీజీపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు నా పేరు చివర (surname) గాంధీ లేకపోయినట్లయితే 29 ఏళ్లకే ఎంపీ అయ్యేవాడినా? అని ఆయన ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గువహటిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. " నా పేరు ఫెరోజ్ వరుణ్ గాంధీ. నా పేరు చివర గాంధీ లేకపోయింటే నేను ఈ 29 ఏళ్లకు ఎక్కడ ఉండేవాడినో అందరికీ తెలుసు. ఇంటిపేరు, ప్రతిష్టలు చూడకుండా ప్రజలందరికీ సనానాహక్కులు కల్పించాలి. అటువంటి దేశాన్నే నేను చూడాలనుకుంటున్నానని చెప్పారు. 


ఈ కార్యక్రమంలోనే ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను తొలగించే హక్కు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇవ్వాలని చెప్పారు. అవసరమైతే 1951 ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సవరించాలని అన్నారు. ప్రస్తుతం రంగం ఏదైనా సామాన్యులకు అవకాశాలు అందకుండా పోతున్నాయని ఆయన వాదన. 


బ్రిటన్ లో లక్ష ఓట్ల సంతకాల సేకరణ ద్వారా ప్రజాప్రతినిధిని తొలగించడం అంశంపై అక్కడి పార్లమెంట్ లో చర్చ చేపట్టుతారు. కానీ, అలంటి చర్చ మన పార్లమెంట్ లో కనిపించవు. తమిళనాడు రైతులు ఢిల్లీలో రోజుల తరబడి నిరసన చేపట్టినా ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. కానీ పార్లమెంట్లో జీతాలు పెంచుకోవడంలో రోజంతా చర్చిస్తారు" అని వరుణ్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.