Ghaziabad: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఘోరం జరిగిపోయింది. అభం శుభం తెలియని ఇద్దరు కవల సోదరులు 25వ అంతస్థు నుంచి పడి మరణించారు. చంద్రుడిని చూసే వంకతో కాలు జారి పడ్డారా లేదా మరేదైనా కారణమా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో(Ghaziabad)తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా మరేదైనా కారణమో తెలియదు గానీ 14 ఏళ్ల ఇద్దర కవల సోదరులు మరణించారు. ఘజియాబాద్‌లోని సిద్ధార్ధ్ విహార్ కాంప్లెక్స్ 25వ అంతస్థు నుంచి కిందకు పడి మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో అంతపైనుంచి ఎలా పడ్డారో తెలియడం లేదు. అసలేం జరిగిందంటే..


రెండేళ్ల క్రితం చెన్నైకు చెందిన ఈ కుటుంబం ఘజియాబాద్‌కు వచ్చింది. సిద్ధార్ధ్ విహార్ కాంప్లెక్స్‌లోని 25వ అంతస్థులో(Twins Fell dead from 25th floor)నివాసముంటున్నారు. మొన్న రాత్రి భోజనం అనంతరం తల్లి మొబైల్‌లో ఇద్దరు కవల సోదరులైన సత్యనారాయణ, సూర్యనారాయణలు ఆన్‌లైన్ క్లాసులు విన్నారు. తరువాత బాల్కనీలో కూర్చుని మొబైల్ గేమ్స్ ఆడసాగారు. తల్లి పడుకోమని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లిపోయారు. తల్లి నిద్రపోయిన తరువాత తిరిగి బాల్కనీలో వచ్చారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇద్దరూ 25వ అంతస్థు నుంచి కిందకు పడి మరణించారు. కాస్సేపటి తరువాత తల్లి లేచి చూస్తే పిల్లలు లేరు. బాల్కనీ తలుపు తీసి ఉంది కింద జనాలు గుంపులుగా చేరున్నారు. అక్కడికెళ్లి చూస్తే ఆ దృశ్యం ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది. ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. 


రక్తపు మడుగులో ప్రాణాల్లేకుండా ఉన్న పిల్లల్ని చూసి జీర్ణించుకోలేకపోయింది.బిడ్డల మృతదేహాల్ని పట్టుకుని రోదించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకని కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాల్ని తరలించారు. బాల్కనీలో ఒక ప్లాస్టిక్ ఛైర్, దానిపై మరో కుర్చీ కన్పించిందని పోలీసులు చెబుతున్నారు. చంద్రుడిని చూసే వంకతో ఇలాంటి ఏర్పాటు చేసుంటారనేది పోలీసుల అంచనా. చంద్రుడిని చూసే క్రమంలో కాలు జారి పడిపోయుంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా మరేదైనా కారణముందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. 


Also read; e Shram Portal Record: ఈ శ్రమ్ పోర్టల్‌కు భారీగా స్పందన, 2 నెలల్లోనే 4 కోట్లమంది నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి