ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకు అశ్లీల సందేశాలు పంపించి, వారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన ఓ ప్రొఫెసర్‌కి దేహశుద్ధి చేసి గుణపాణం చెప్పారు అదే కళాశాల విద్యార్థినులు. పంజాబ్‌లోని పటియాల ప్రభుత్వ మహిళా కళాశాలలో చోటుచేసుకున్న ఈ ఉదంతాన్ని ప్రత్యక్షసాక్షులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఆదివారం ఆ వీడియోను ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ప్రొఫెసర్ తమకు ఫోన్‌లో అశ్లీల సందేశాలు పంపుతుండటంపై ఆగ్రహం వ్యక్తంచేసిన విద్యార్థినులు... అతడిని కళాశాల ఆవరణలోకే లాక్కేళ్లి పబ్లిగ్గా దేహశుద్ధి చేశారు. ఇదిలావుంటే, విద్యార్థినుల పట్ల ప్రొఫెసర్స్ అసభ్యంగా ప్రవర్తించడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలోనే ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తోన్న ఓ ప్రొఫెసర్‌కి వ్యతిరేకంగా క్యాంపస్‌లో నిరసనలు జరగడం, విద్యార్థినుల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఆ ప్రొఫెసర్‌ని అదుపులోకి తీసుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఇలా నిత్యం దేశంలో ఏదో ఓ మూలన ఒక ఘటన మరిచిపోకముందే వెలుగుచూస్తోన్న మరో ఘటన విద్యార్థినులను, వారి తల్లిదండ్రులని ఆందోళనలకు గురిచేస్తున్నాయి.