PM Modi: ప్రపంచంలోనే పాపులారిటీలో నెంబర్ వన్‌గా మోదీ..తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..
PM Modi: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు.
Global Leader Approval list: భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మరోసారి తన మానియా చూపించారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల నేతల్లో (most popular leader in the world 2021) మోదీ మెుదటి స్థానంలో నిలిచారు.
Also Read: Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో11 కి చేరిన మృతుల సంఖ్య
సంపన్నదేశాల అధ్యక్షులు కూడా మోదీ(Modi latest news) దరిదాపుల్లో లేరు. అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) విడుదల చేసిన 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ (Global Leader Approval)' రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు.
మార్నింగ్ కన్సల్ట్(Morning Consult) అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తుంది. గతేడాది కూడా ప్రధాని మోదీనే(pm modi latest news) మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి సర్వేలో భారత్‌లో 2,126మందిని ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసింది మార్నింగ్ కన్సల్ట్.
ఈ సర్వే ప్రకారం, ఈ ఏడాది మోదీ(modi news today) 70శాతం ఓట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden) ఆరో స్థానానికి పరిమితమయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ టాప్ 10లో చివరిస్థానంలో నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook