Goa assembly polls: గోవా అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP). న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన అమిత్‌ పాలేకర్‌ను (Amit Palekar) సీఎం అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఆ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రకటన చేశారు. గోవాలో ఉన్న 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమిత్ పాలేకర్ బండారీ (Bhandari) సామాజిక వర్గానికి చెందిన నేత. గోవాలో దాదాపు 35 శాతం జనాభా వీరే ఉన్నారు.  ఇటీవల పాత గోవా వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలని కోరుతూ ఇటీవల నిరాహార దీక్ష చేపట్టిన పాలేకర్​.. ప్రజల దృష్టిని ఆకర్షించారు. గతేడాది అక్టోబర్‌లో ఆప్‌లో చేరారు. ప్రజల నుంచి పాలేకర్​కు లభించిన మద్దతుతో ప్రభుత్వం దిగివచ్చిందని కేజ్రీవాల్​ పేర్కొన్నారు. 


Also Read: Punjab Elections 2022: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా 'భగవంత్ మాన్'..


ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను (Bhagwant Mann) మంగళవారం ప్రకటించారు. గోవాలో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. 40 స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్‌ (Goa assembly Elections 2022) నిర్వహించనున్నారు. అటు భాజపాతో పాటు, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన సైతం ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రధాన పార్టీలన్నీ చిన్న రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించడంతో గోవా ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook