న్యూ ఢిల్లీ : భారత్‌లో బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గినట్టుగానే తగ్గిన బంగారం ధరలు గురువారం మళ్లీ 0.4 శాతం పెరిగి రూ.42,668కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,649 డాలర్లుగా ఉంది. సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,788 మార్కుని తాకినప్పటికీ.. మంగళవారం, బుధవారం ధరలు రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధరలు ఇక దొగొస్తాయేమోనని బంగారం ప్రియులు భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా దిగొచ్చినట్టే కనిపించిన బంగారం ధరలు గురువారం మళ్లీ పెరగడంతో రూ 42,668కి చేరాయి. తాజాగా ధరలు పెరిగినప్పటికీ.. సోమవారంతో పోల్చుకుంటే గురువారం నాటి ధరలు తక్కువేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్‌ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగారాన్ని పెట్టుబడిదారులు సురక్షిత మార్గంగా ఎంచుకుంటుండడంతో బంగారం ధరలు అమాంతం కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : Gold rates today : భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏడేళ్లలో ఇదే గరిష్టం!


ఇక వెండి ధరల విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 1805 డాలర్లుగా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.49,600కి చేరుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..