Gold Price Today: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం దిగొచ్చాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గాయి.
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మంగళవారం దిగొచ్చాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గాయి. జ్యువెలర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరలు తగ్గాయి. వెండి సైతం బంగారాన్ని అనుసరించింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.215 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,170 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.318 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల ధర మరోసారి నలభైవేల కిందకి దిగింది. 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.39,520కి క్షీణించింది. కరోనా ఎఫెక్ట్: వాట్సాప్ వినియోగదారులకు షాక్
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.421 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,299కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.402 తగ్గింద. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,018 వద్ద ట్రేడ్ అవుతోంది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
కాగా, వెండి సైతం పసిడినే అనుసరించింది. కానీ అతి స్వల్పంగా రూ.10 తగ్గింది. వెండి కేజీ ధర నలభై వేల కిందనే ట్రేడ్ అవుతోంది. 1కేజీ వెండి ధర రూ.39,500 అయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.39,500 వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
బుల్లితెర భామ టాప్ Bikini Photos