Central Government Employees Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్ (యూపీఎస్‌) చుట్టూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) స్థానంలో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. యూపీఎస్‌లో చేరాలనే కచ్చితమైన నిబంధనను పెట్టలేదు. ఎన్‌పీఎస్‌లో కంటిన్యూ అవ్వాలనుకునే ఉద్యోగులు అలానే కొనసాగవచ్చు. ఇక యూపీఎస్‌లో చేరాలనుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఫారమ్ 6-Aను శుక్రవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) రిలీజ్ చేయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Kangana Ranaut: రేప్ లు ఎలా జరుగుతాయో కంగానా కు చాలా అనుభవం.. రచ్చగా మారిన మాజీ ఎంపీ వ్యాఖ్యలు.. వైరల్ గా మారిన వీడియో..


ఈ ఫారమ్ ఈ ఏడాది డిసెంబర్ నెల తరువాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు భవిష్య/ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్ (ఆన్‌లైన్ మాడ్యూల్స్)లో అందుబాటులో ఉంటుంది. ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో ఉన్న పదవీ విరమణ చేసే అధికారులు ఫారమ్ 6-ఎ దరఖాస్తును నింపాలి. ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్ ద్వారా (సూపరెన్యుయేషన్ కేసులు మాత్రమే), ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో లేని పదవీ విరమణ చేసే అధికారులు భవిష్యలో ఫారం 6-ఎ నింపాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారం భవిష్య/ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో ఏకీకరణతో పాటుగా కొత్త ఫారమ్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త ఫారమ్‌లో మొత్తం 9 ఫారమ్‌లు విలీనం చేసినట్లు చెప్పారు.


పదవీ విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపు ప్రారంభమయ్యే వరకు మొత్తం పెన్షన్ ప్రాసెసింగ్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడానికి ఈ ఫారమ్ ఉపయోగపడుతుంది. ఇది మొత్తం పెన్షన్ ప్రక్రియలో పేపర్‌లెస్ ఈజీ ప్రాసెస్‌లో కంప్లీట్ అవుతుంది. గతంలో మాదిరి పెన్షనర్లు తాము పూరించిన లేదా మిస్ అయిన ఫారమ్‌ల గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


 e-HRMSని ఉపయోగించి రిటైర్‌మెంట్ అయ్యే అధికారులు ఫారమ్ 6-Aని పూర్తి చేస్తారు (సూపరెన్యుయేషన్ కేసుల కోసం మాత్రమే). అయితే e-HRMSలో లేని ఉద్యోగులు.. భవిష్యను ఉపయోగించి దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. కొత్త ఫారమ్‌లను ఇప్పటికే ఉన్న తొమ్మిది ఫారమ్‌లు/ఫార్మాట్‌లను  6, 8, 4, 3, A, ఫార్మాట్ 1, ఫార్మాట్ 9, FMA, జీరో ఆప్షన్ ఫారమ్‌లను విలీనం చేశారు. ఈ మార్పుకు అనుగుణంగా CCS పెన్షన్ రూల్స్, 2021లోని రూల్స్ 53, 57, 58, 59, 60కి సవరణలు చేశారు. ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను కేవలం ఒకే ఒక సంతకంతో పూర్తి చేయవచ్చు. పదవీ విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభించే వరకు పెన్షన్ ప్రాసెసింగ్ వర్క్‌ఫ్లో మొత్తం ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్‌లోనే జరగనుంది.


Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.