Gold rate:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పండగ సీజన్ వచ్చింది అంటే మహిళలు ఎంతోకొంత తమ దగ్గర దాచుకున్న డబ్బును ఉపయోగించి కాస్త బంగారం కొనాలి అని ఆశ పడతారు. అయితే ఈసారి పండక్కి బంగారం ధరలు అటకెక్కి కూర్చున్నాయి. దీంతో చిన్నాచిత వస్తువులు ఏమన్నా తీసుకోవాలి అని కష్టపడి డబ్బులు దాచిపెట్టుకున్న వారికి కాస్త ఇబ్బందే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో లుక్కేద్దాం పదండి..


గత కొద్ది కాలంగా వరుసగా గోల్డ్,సిల్వర్ ధరలు పెరుగుతూ పోవడంతో అసలు బంగారం కొనాలా వద్దా అనే కన్ఫ్యూషన్ మొదలైంది. పండగ మొదలైన మొదటి నాలుగు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారి 18 పైగా పెరిగి కూర్చుంది. ఈ నేపథ్యంలో పండక్కి బంగారు కొనాలి అనుకున్న వారికి ఏం చేయాలో అర్థం కాని స్థితి ఎదురయింది. ఇటువంటి వారికి ఊరట కలిగిస్తూ.. ఈరోజు బంగారం ధర కాస్త తగ్గడం మొదలుపెట్టింది. దీంతో ముందు రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో బంగారు ధర ఎలా ఉందో తెలుసుకుందాం.. మన కాపిటల్ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 56,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం 61,750 ఉంది. చెన్నైకి ఢిల్లీకి ధరల్లో ఎటువంటి వ్యత్యాసం లేదు. మరోపక్క ముంబై ,పుణెలో 22 క్యారెట్ల గోల్డ్ విలువ 56,350 కాగా, 24 క్యారెట్ల ధర 
61,450 ఉంది. ఇక హైదరాబాద్, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం విషయానికి వస్తే ముంబై,  పూణేలో ఉన్న ధరే ఇక్కడ కూడా కనిపిస్తోంది.



వెండి


బంగారం ధర తగ్గింది అంటే వెండి ధర కూడా తగ్గినట్టేగా.. పైగా పండగ అంటే ఆడవారు వెండి సామాను కొనడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతారు. మెట్టల దగ్గర నుంచి కాలి పట్టీల వరకు.. అగరవత్తి స్టాండ్ దగ్గర నుంచి ప్రసాదం పెట్టే గిన్నె వరకు ఏదైనా కొనుక్కోవచ్చు. ఇక వెండి ధరల విషయానికి వస్తే చెన్నై, హైదరాబాద్, విజయవాడ ,విశాఖపట్నం లో కేజీ వెండి 78,500 ఉంది. అయితే ఢిల్లీ , కోల్‌కతా  నగరాలలో మాత్రం వెండి కిలో విలువ 75,100 ఉండగా.. అన్నిటికంటే తక్కువగా మన పక్క రాష్ట్రమైన బెంగళూరులో మాత్రం వెండి ధర 74,500 ఉంది. మరి లేడీస్ ఆలస్యం చేయకుండా బంగారం ,వెండి కొనేసుకోండి.


Also read: Rahul Gandhi Speech: తెలంగాణలో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తాం.. రాహుల్ గాంధీ


Also read: Rahul Gandhi Speech: తెలంగాణలో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తాం.. రాహుల్ గాంధీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook